శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 234 / Sripada Srivallabha Charithamrutham - 234

Image may contain: 1 person, flower
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 234 / Sripada Srivallabha Charithamrutham - 234 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 45
🌻. హనుమంతులవారిని భూమి మీద అవతరించమని ఆదేశించడం 🌻

శ్రీ భాస్కర పండితులు తిరిగి కొనసాగించారు : శ్రీపాదులవారు మహాపుణ్యక్షేత్రం, సిద్ధులకు నెలవు అయిన కాశీలో గంగా స్నానానికి ప్రతి రోజూ యోగ మార్గంలో వస్తారు. తమ తరువాతి నరసింగ సరస్వతి అవతారంలో అక్కడే సన్న్యాస దీక్షను స్వీకరిస్తారు. 

గృహస్థులకు క్రియా యోగాన్ని బోధించడానికి శ్యామాచరణుడు ఇక్కడ జన్మిస్తాడు. హనుమంతుడిని అతని దగ్గరకు పంపి క్రియాయోగ దీక్షను ఇప్పిస్తానని అక్కడ ఉన్న ఋషులతో చెప్పారు. బదరికావనంలో నరనారాయణ గుహలో అనేకమందికి క్రియాయోగ దీక్షను ఇచ్చి... ఊర్వశీ కుండంలో, ఋషి గంగలో స్నానంచేసి...  సర్వేశ్వరానంద యోగిని ఆశీర్వదించి... నేపాళ దేశంలో హనుమంతుల వారికి సీతా, రామ, లక్ష్మణ, భరత , శతృఘ్న సమేతంగా దర్శనాన్ని ఇచ్చి... అతడు అగ్ని బీజమైన 'రాం' మంత్రజపంతో కాలాత్మకుడు, కాలాతీతుడు అయినాడని... “శాయీ" అనే నామంతో అవతారాన్ని ధరించమనీ
తెలిపారు.

హనుమ శివాంశ సంభూతుడు అయినా రామభక్తుడు. అరబ్బీ భాషలో ' అల్ ' అంటే శక్తి అనీ .... అహ్ ' అంటే శక్తిని ధరించినవాడు ' శాక్త' అని అర్థం. కనుక అల్లా అంటే శివశక్తులని అర్ధం. అందువలన మ్లేచ్ఛులకు ఆమోదయోగ్యమైన ' అల్లా ' నామాన్ని జపిస్తూ, హనుమ సాయి నామంతో శ్రీపాదులను శివశక్తిగా ఆరాధిస్తాడు. ' అల్లా మాలిక్ అంటే అల్లాయే యజమాని అని అర్ధం. తన యొక్క భరద్వాజ గోత్రంలోనే హనుమ అవతరిస్తాడనీ... స్వామి సమర్ధులుగా తాము దేహం విడిచే సమయంలో, సాయి తన అవతారం అని స్పష్టంగా తెలుపుతాననీ... కాలాతీతుడు అయినందువల్ల సాయుజ్యాన్నీ,
' నాధ' శబ్దాన్ని ఇచ్చి, 'సాయినాధుడి' గా పిలవబడతాడు అనీ... ఆ రోజు దత్త జయంతిగా నిర్ణయించి, హనుమలోని చైతన్యాన్ని దత్త చైతన్యంగా మార్చేశారు.

అతనికి మేచ్ఛ గురువుగా తనలో లీనమైన "మహబూబ్ సుభానీ" అనే జ్ఞాని వారిష్ ఆలీషా” గా జన్మిస్తాడనీ... శ్యామాచరణుడు క్రియా యోగాన్ని బోధిస్తాడు అనీ... వెంకూసాగా
పిలవబడే గోపాలరావు వైష్ణవ గురువు అవుతాడనీ తెలిపారు. జానకీమాత ఇచ్చిన మాణిక్యహారాన్ని హనుమ పారవేస్తే... దానిని తాము భద్రం చేసి ఉంచామనీ... ఆ మాణిక్య హారమే గురు స్వరూపమై మాణిక్య ప్రభువు అని పిలవబడతాడనీ శ్రీపాదులవారు తెలిపారు.

ఇక్కడ నుండి ద్రోణగిరి అనే సంజీవని
పర్వతం దగ్గరకు, అక్కడ నుండి మహా
యోగులకు కూడా దర్శించడానికి వీలుకాని, కల్కి ప్రభువు జన్మించే శంబల గ్రామానికి వెళ్ళి, అక్కడ ఉన్న స్ఫటిక పర్వతంలోని శుద్ధ జలాన్ని త్రాగినందువల్ల 16 సంవత్సరాల వయస్సులోనే వారి శరీరం నిలిచిపోయింది.

తరువాత గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు అనేక దివ్య లీలలను చూపించి... శ్రీశైలానికి
వెళ్ళి... యోగ మార్గంలో సశరీరంతో
సూర్యమండలానికీ, ధృవ నక్షత్రానికీ,
సప్తర్షి మండలానికీ, ఆర్ద్ర నక్షత్రానికి
వెళ్ళి... తిరిగి శ్రీశైలానికి 4 నెలల
తరువాత వచ్చారు. 

ఆర్థా నక్షత్రం నుంచి దివ్యజ్ఞాన యోగం అనే నూతన యోగాన్ని, శ్రీశైలంలోని సిద్ధ పురుషులకు బోధించారు. తరువాత కురుంగడ్డ అనే దివ్య స్థలాన్ని చేరారు అని భాస్కర పండితులు శంకరభట్టు, ధర్మగుప్తులవారికి శ్రీపాదులవారు పీఠికాపురాన్ని విడచి, కురువపురాన్ని చేరేవరకూ జరిగింది వివరించారు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sripada Srivallabha Charithamrutham - 234 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 25
🌻 The birth of Vashista and Agastya 🌻

When that ‘poorna kumbham’ was kept upside down, two great munis manifested. The first one manifested with white glow. He is Vashista. The second one Agastya was born with blue glow. Both were born with the amsas of Gods Mithra and Varuna.

 One should do Rudrabhishekam eleven times with the consecrated water in poorna kumbham. Then Parameswara who is the form of Ekadasa Rudras will give the power of merit of Ekadasi thithi. 

One should learn that Siva and Kesava are not different as there is a close relation between Ekadasa Rudras and the Ekadasi thithi related Vaishnavas. 

If Ekadasa Rudra Abhishekam is done with Namakam and Chamakam, the detrimental effects like premature deaths will be destroyed. The supporting Murthi of somalatha is Moon. 

He will shower the basic power for giving life again. This chandrakala will be glowing in Yogi’s head in the middle of forehead above the eye brows and infront of sahasraram. 

🌻 Description of different forms of Eswar 🌻

For this reason, it is said that Siva has ‘chandrakala’ on the head. In the Somanath kshetram in Gujarath, the Siva lingam is made of Chandrakantha Sila. 

On its head, there is a ‘sphatika’ (crystal) lingam in which a white moon crescent will be glowing. The shastras say that without getting Rudratwam himself, one should not do Rudra abhishekam. 

Time (kaalam) engulfs everything. So, the person doing abhishekam should become a ‘kaalaatmaka’ and invoke ‘yajna swaroopa’ into his body with Mahanyasam and then do Rudra abhishekam. In the method of Mahanyasa Rudra abhishekam, as described by Bodhayana maharshi, there are five murthis of Siva. 

They are Tatpurusha, Aghora, Sadyojatha, Vamadeva and Eesana. The Tatpurusha murthi will be in the form of ‘vidyut varna’ like pralaya agni. Aghora murthi will be in ‘blue colour i.e. black honeybee blue colour. Sadyojatha murthi is in white colour like moon. Vamadeva murthi is in Goura varna. Eesana murthi is Tejo murthi. 

So He is in Akasa varna’   Rudras are said to be in thousands of thousands in number. That means, the Gods said to be Rudra Gurus are there, three for each ‘gana’. 

Thus for 11 Rudra murthis, there are 33 crore of Rudra ganas. They surround the earth, sky, cosmos, water, air, sareera (body), prana and mind. That is what Veda says.

People who worship and remember Sripada will get  the grace of 33 crore Rudra ganas. The Prabhu (lord) for the 33 crore Rudra ganas is Ganapathi. Sripada Srivallabha was born on Ganesh Chaturthi day to indicate the Ganapathi tatwam in Him. So people who remember Sripada will be able to get the grace of 33 crore Rudra ganas. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹