శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 233 / Sripada Srivallabha Charithamrutham - 233

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 233 / Sripada Srivallabha Charithamrutham - 233 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 44
🌻. కర్త ఎవరు? 🌻

ఆ తరువాత గ్రంథ రచన విషయంలో నా భయాలని కనిపెట్టి, "ఈ చరితామృత గ్రంథాన్ని వ్రాయడానికి కాని, అనువదించ డానికి కాని యోగ్యత ఉన్నవారిని స్వయంగా ఆయనే ఎన్నుకుంటారు. 

ఈ గ్రంథాన్ని వ్రాసేటప్పుడుకాని, అనువదించే టప్పుడు కాని గ్రంథకర్తపైన, అనువాదకుల పైన వారి కృపాదృష్టి ప్రసరిస్తూనే ఉంటుంది. కాబట్టి నీవు ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నావనేది పైకి కనిపించే ఒక ప్రక్రియ మాత్రమే, వాస్తవానికి వ్రాయించేది వారే, శ్రీపాదశ్రీవల్లభులే." అని నిష్కర్షగా చెప్పారు. 

"నాలాంటి అల్పఙ్ఞునితో ఇంతటి మహత్ కార్యాన్ని చేయించడం ఆశ్చర్యంగాను, ఆనందం గాను ఉన్నది," అన్న నా మాటలను విని, "దత్తుని విధానమే అంత. 

నిషిద్ధ పదార్ధాలతో వ్యాధులను తగ్గించడం, బొత్తిగా ఏమీ తెలియని వారితో మహత్కార్యాలను చేయించడం వారి విధానం, వారికది వినోదం, దివ్యశక్తికి నిదర్శనం కూడా," అని దత్త విధానాన్ని వర్ణించారు. ఆ తరువాత ఒక విచిత్ర సంఘటన మాకు వినిపించారు. 

🌻. మత్స్యావతార రహస్యం 🌻

"ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయానికి వచ్చి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుండగా మత్స్యావతారానికి యోగ పరమైన అర్థం ఏదైనా ఉందా? అన్న ఆలోచన వారి మనసులో మెదిలింది. 

సరిగ్గా అదే సమయానికి వర్మ, శ్రేష్ఠిగార్లు శ్రీపాదులను తీసుకొని అక్కడకు వచ్చారు. ఆ సన్యాసిని చూస్తూనే శ్రీపాదులు, "ఈ చేపలవాడిని ఇక్కడకు ఎవరు రానిచ్చారు?" అని అడిగారు. వారి నోటివెంట ఈ మాట రావడం తడవుగా సన్యాసి శరీరంనుండి చేపల వాసన రావడం మొదలుపెట్టింది. 

శ్రీపాదులు తీక్ష్ణంగా ఆయనను చూడటంతో అతనికి యోగదృష్టి కలిగి తన శరీరంలోని రక్త నాళాలలోను, విభిన్న ద్రవాలలోను వివిధ కణాలు చేప ఆకారంలో ఉండటం గమనించారు. 

ఆ చిన్నచిన్న కణాలే శరీరంలో అనేక రకాల అనుభూతులను కలిగిస్తున్నాయని అలాగే వాసనను గ్రహించ గలిగే, రుచిని పసిగట్టకల్గే కణాలు కూడా చేప ఆకృతిలోనే ఉన్నట్లు గమనించారు. 

సృష్టి మొదట అంతా జలమయమని పరిణామ ప్రక్రియలో చేప మొదటి జంతువని అదే మన శరీరంలోని తత్వాన్ని కూడా సూచిస్తుందని అదే మత్స్యావ తార ప్రక్రియ అని వారికి అర్ధమయ్యింది. అతడు శ్రీపాదుల చరణాలు తాకి నమస్కరించాడు
 శ్రీపాదుల కరుణావృష్టితో ఆ సన్యాసి శరీరంనుండి సువాసనలు రాసాగాయి. 

శరీరంలోని అనుభూతులలో చక్కటి మార్పు వచ్చినట్లైతే అది భౌతికంగా కూడా ప్రకటం అవుతుందని శ్రీపాదులు మౌనంగా బోధించారు. "ఓయీ! మత్స్యావతారం గురించి నీకు తెలిసింది కదా!. కూర్మావతారం దైవీ ప్రకృతికి, అసురీ ప్రకృతికి ఆధారం. 

మంధర పర్వతాన్ని కూర్మంమీద ఉంచే దేవదానవులు సముద్రాన్ని మధించారు, కాని కూర్మం మాత్రం అంతర్ముఖంగా ఉంటూ నిశ్చలంగానే ఉండిపో యింది. అదే విధంగా నీవు కూర్మ న్యాయంతో అంతర్ము ఖుడవై యోగాభ్యాసం చేయాలి.

 కర్మబంధంనుండి విడుదల పొందాలి, బహిర్ముఖుడవయ్యావో బంధనాల్లో ఇరుక్కు పోతావు," అని బోధించారు. 

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 233 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 25
🌻 The greatness of Rudraksha Ways of Siva worship – Their Results 🌻

I asked Sri Dharma Gupta to grace me by telling how to do worship of Siva and in what method. 

Sri Dharma Gupta said, ‘Sir! Shankar Bhatt! The first method is doing Siva Panchakshari through ‘japa’ and ‘anushthana’. The second method is through Mahanyasa. 

The third one is by doing Rudra Abhishekam. The five letters in the panchaakshari represent the pancha bhutas. Jeeva is called ‘pasuvu’ because he is in the bonds (paasas) like passion etc. The one who gives the liberation from the bonds to pasuvu is ‘pasupathi’. 

Siva Panchaakshari is described as a star having five angles. In the mantras of this five angles, the mantras that give liberation are one type and those that give wealth and fame are the second type. 

In the five ‘upachaaras’ (services), chandan (gandham) is used for Bhutatwam, coconut water for jala tatwam, deeparadhana for agni tatwam, sambrani dhupam which gives a good fragrance for vayu tatwam and ghantanadam (ringing bell) for akasa tatwam. The five letters in panchaakshari, the five tatwas, give darshan in five colours to those who do sadhana. 

(1) The glow like a white pearl or mercury (2) The red light similar to Pagadam (3) Golden Yellow colour (4) 

The all pervading blue colour like blue sky (5) Pure white light. The glow of five coloured jyothi was mentiond as sandhyopasana by Risheeswaras. 

The main types of sadhana are yantram, mantram, pancha tatwa sadhana, yoga sadhana and surrender to ‘atma’. With this, the thinking that ‘dehatma’ (body is atma) will perish and one feels that jeeva’s body is the temple and the jeeva who glows in it is Sivatma. 

Thus he attains liberation. To get this state, japa of panchaakshari, Sivaaraadhana with Mahanyasam and Rudra abhishekas help.  Vishnu is fond of ‘sahasra nama stotra’ (chanting of His thousand names). 

Ganapathi is fond of Modakas. Sun is fond of prostrations. Chandra (moon) is fond of ‘water offering’s. Agni (fire) is fond of ‘havis’. Siva will be pleased with abhishekam. 

Previously when ‘pralayam’ came in one kalpam, Brahma filled the seeds of all jeeva rasis, trees and medicinal plants in a kalasam for future creation. In that he poured amrit and the water from all seas and rivers. With Gayathri mantra, He invoked His prana Shakti into it. 

This is called ‘poorna kumbham’. Maharshis annointed earth with amrit from this poorna kumbham in a continuous stream. This kalasa abhishekam happened at Kailasa giri. So it became the place of amrit. 

On the full moon day in the month of Shravan, the ice lingam forms naturally in the cave of Amaranath. With mere darshan of that Lingam, all sins will perish.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹