శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 4 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 4

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 4 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
శ్రీమాణిక్ ప్రభులాంటి అద్వితీయమైన శ్రేష్ఠులు బయమ్మ (బయాదేవి) కడుపున పుట్టడం వలన ఆమెను దేవీ స్వరూపంగా కొలవాలి.* బచ్చమ్మ తల్లి గారి ఊరు అంటే మనోహరనాయక్ తాతగారి ఊరైన లాడవంతిలో ప్రభువు జన్మించారు. తండ్రికి పరమానందమైనది. ఈ బాలుని జాతకం స్వయంగా తనే చూసి జయప్ప అనే స్వర్ణకారుడి దగ్గర ఆ జాతకాన్ని ఉంచారు.
బచ్చమ్మ మనవడిని ముద్దుగా 'రత్నా' అని పిలిచేది. అలాగే తల్లి తండ్రి కూడా పిలిచేవారు. ఆప్తులు లాడన్ షా, మదన్ షా అని పిలిచేవారు. వారి వంశంలో అద్వితీయ రత్నం ఉద్భవించిందని వీరందరి భావన. ఆ బాలుని శరీరం బ్రహ్మతేజస్సుతో వెలుగుతూ ఉండేది. విశిష్ట కారణంతో అవతారం భూమిపై ఉద్భవించినపుడు అందుకు అనువైన వంశం చూడాల్సివస్తుంది. పూర్వం ఈ వంశం సామాన్యంగా ఉండేది. ఐశ్వర్యం, సామర్ధ్యం, వ్యవహారిక జ్ఞానం మొదట్లో ఉండేవి కావు. అందుకని ప్రభు ఈ వంశాన్ని ఆశ్రయంగా తీసుకొని అన్ని రకాలుగా ఆ వంశాన్ని ఉద్ధరించారు. మంచిపళ్ళు తినడానికి దొరికితే ఆ వృక్షము ఎలా శ్రేష్ఠమైనది అంటామో ఆ విధంగా ఈ వంశం అత్యంత ఉన్నతమైనది అనాలి. ప్రభు జన్మ సమయంలో నాలుగు దిక్కులు ప్రకాశవంతమై సాక్షాత్ దత్తాత్రేయులు ప్రత్యక్షం అయ్యారని అందరూ చరిత్రకారులు, అక్కడివారు వర్ణించారు.
ఒక సామాన్య వంశంలో జన్మించిన వ్యక్తి నిర్వికారుడై ప్రజలను ప్రేమతో ఆకర్షించుకోవడంలో సమర్ధులై ఉండేవారు. వేల మంది కాదు, లక్షలాది మందికి అన్న వస్త్రాలే కాకుండా ధనం ఇచ్చి అన్ని రకాల కోరికలను నెరవేర్చేవారు.* ఇంతేకాదు జగత్తుకు ఆదర్శమూలమైన ఒక తత్వవేత్త స్వతహాగా ఆచరణలో తెచ్చి దాన్ని స్థాపన చేశారు. హిందూ, ముస్లిం, సిఖ్, జైన్, లింగాయత్ మొదలైన అనేక జాతి లేదా ధర్మాల వారికి స్వభావసిద్ధమైన శత్రుభావాన్ని మర్చిపోయేలా చేసి అందరినీ ప్రేమతో ఒక తాటిపైకి తెచ్చి వారినుండి 'ప్రభురేవ ప్రభు సాక్షాత్' 'పీరానపీర్ దస్తగీర్' 'నానక్ సోహి మాణిక్' 'ధన్య ప్రభు' అన్న వాటిని నిజం చేశారు. లోకోద్ధరణ కోసం అవతరించిన వారి స్వభావం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఊయలలో ఉన్నప్పుడే వారి తత్త్వం తెలుస్తుంది అనడం అవాస్తవికత అనిపించుకోదు. ప్రభువు యొక్క మహిమ కుమారదశ నుండే కనిపించేది.
'మాసానాం మార్గశీర్షోహం' అని గీతా వాక్యము. పన్నెండు మాసాలలో మార్గశిర మాసం శ్రేష్ఠమైనదని అర్ధం. ఈశ్వరనామ సంవత్సర మార్గశిర మాసం శుక్ల చతుర్దశి చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉన్న రాత్రి ప్రభు జన్మించారు. ఆ సంవత్సరములో మంచి వర్షాలు పడడం వలన భూమి సస్యశ్యామలమయింది. నదులు, కాలువలు, బావులలో నీరు ఉండటం వలన పశువులు, పక్షులు, మనుష్యులు సుఖంగా ఉండేవారు. లోకోత్తర సామర్ధ్య సంపన్నుడు మనుష్యుల మధ్య జన్మిస్తే కారణం తెలియకుండానే మనసు ఆనందమయమవుతుంది.
భగవాన్ శ్రీ కృష్ణుని జన్మ సమయంలో సృష్టి యొక్క స్వరూపం క్రింది విధంగా ఉండేది. పరమ మంగళకారకమైన భగవంతుని జన్మ కాలము సమీపించింది. ఆ సమయంలో అన్ని నక్షత్రములు గ్రహాలు శాంతమై చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఆకాశంలో నిర్మలమైన నక్షత్రోదయమయింది. పృథ్విపై గోకులంలో మంగళోత్సవం ప్రారంభమయ్యింది. నదులలోని నీరు నిర్మలమయ్యింది. చెరువుల్లో కమలాలు వికశించి వింతశోభ కనిపించింది. వనంలోని పుష్పాలు, పక్షులు, ప్రాణులు భ్రమర నాదం చేయసాగాయి. పవిత్రమైన సుగంధం వ్యాపించి ఆ మనోహర స్పర్శతో స్వచ్ఛమైన గాలి వ్యాపించింది. ఈ వర్ణన ప్రభు జన్మ సమయానికి కూడా వర్తిస్తుంది.
ఆ తర్వాత మనోహరనాయక్ కి మూడవ పుత్రుడు సర్వజిత్ నామ సంవత్సర పుష్య శుక్ల త్రయోదశి సోమవారం జన్మించారు. నృసింహ అని పేరు పెట్టారు. బచ్చమ్మ వృద్ధాప్యంతో మరణించగానే కొద్ది కాలానికి మనోహరనాయక్ కూడా కాలం చేశారు. బయాదేవి తన ముగ్గురు పుత్రులతో కళ్యాణ్ లో నివసించేవారు. బయాదేవి అన్నగారి సహాయమే చాలా అండగా ఉండేది. ప్రభువు బాల్యం చాలావరకు కళ్యాణ్ లోనే గడిచింది. ముగ్గురు పుత్రులతో పాటు మనోహరనాయక్ కి చిమనాబాయి అనే పేరుగల కుమార్తె ఉండేది.
తరువాయి భాగం రేపు చదువుకుందాము.......
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🙏🙏🙏🙏🙏
🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 4 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj
🌻 02. Birth and early life - 2 🌻
When the sacred thread was being bestowed on him and the sacred Gayatri hymn was being recited in his ears, as was the custom, a strange thing took place.
Manik behaved as though all this was superfluous for him and he knew all about Gayatri and the significance of the eternal sound, AUM. He recited the hymn unaided, to the great surprise of the assembled people.
As none could explain the inexplicable event, it was said to be a remarkable event and was left as such. None attached further notice to this event.
Manik was again free to roam in the woods. When he was sent to the school, his attention was to the open sky, the cool breeze, the rustling leaves and the chirping of the birds. The books were stale for him and the lessons boring. The enclosed class room was suffocating and the teachers were un-inspiring.
He had, in fact, an extraordinary capacity to absorb what was conveyed to him but what was being conveyed to him appeared too little and too stale to capture his imagination.
He liked to seek teachers in the lap of nature, listen to Nature’s natural education rather than the artificial or contrived lessons in the class room. It was not surprising therefore, that he was given to sneaking out of the class rooms and wandering in the woods.
It is said, when Satyakama approached his teacher’s residence, his face was shining brilliant. Upon which the teacher asked: “Verily, my dear, you shine like one knowing Brahman. Who has taught you?”
To this Satyakama replied, “Others than men” (Chhandogya Upanishad IV.9.2). In like manner, Shri Dattatreya is said to have twenty four teachers from nature. “Many are my preceptors,” he told King Yadu, “selected by my keen sense, from whom acquiring wisdom freely,
I wander in the world … The earth, breeze, sky, water, fire, the moon and the Sun; the dove, python, sea, moth, honeybee, elephant, honey gatherer, deer, fish, Pingala the courtesan, sea-eagle, infant, maiden, forger of arrows, serpent, spider and bumble bee are the twenty four preceptors accepted by me.
From their behaviour, I have learned all that is to be learned in this life for my good” (Bhagavat Purana – XI.7.32-35).
In like manner, the formal education needed for making one fit for normal worldly life, was obviously not required for Manik.
For, it appeared that he would rather wander through the woods gathering wisdom right from Nature than information from the class room, which would neither enlighten him nor elevate his Self towards That for which he had taken this descent.
Nature became his class room and his very Self became his teacher. His receptivity became keen, intelligence sharp and thoughts synchronised.
He came to be aware of things for which even normal perception was denied. And sure enough, he started speaking like one who was authorised to speak.
Continues......
🌹 🌹 🌹 🌹 🌹