శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 3 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 3

Image may contain: one or more people, people sitting, beard and indoor, text that says "24 చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్దురు మాణిక్ప్రభు మహారాజ్"

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 3 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻

🌷. పూర్వ చరిత్ర మరియు జన్మము 🌷

    నిజాం రాజ్యంలోని ఒక ఉపసంస్థానంలో మనోహరనాయక్ అనే పేరు గల బ్రాహ్మణ గృహస్థులు ఉండేవారు. ఉపసంస్థానం యొక్క రాజధానికి 'కళ్యాణి' అనే పేరు ఉండేది. ఇప్పటికీ అదే పేరు వాడుకలో ఉంది. ఈ కల్యాణిని కొందరు కళ్యాణ్ అని కూడా అంటారు. మొదట ఇది మహారాష్ట్రలో ఉండేది. దీనిని కల్బుర్గి కళ్యాణి అనేవారు. ముంబై కి దగ్గరలో ఒక కళ్యాణ్ అనే ఊరు ఉంది. ఆ కళ్యాణ్ నుండి ఈ కళ్యాణ్ భిన్నమైనది అని తెలపడానికి కల్బుర్గితో ముడివేశారనిపిస్తుంది. 

   మనోహర్ నాయక్ పూర్వీకులు కళ్యాణ్ లో నివసించేవారు కాదు. 'హారకుడ్' అనే ఒక పల్లెటూరు నుండి కళ్యాణికి వచ్చి నివసించారు. తరువాత 'హర్ కుడే' అనే ఇంటిపేరు స్థిరపడిపోయింది. పూర్వం ఇంటిపేరుతోనే పిలిచేవారు. *మనోహర్ నాయక్ ఇంట్లో అందరూ ఈశ్వర భక్తులై, సాత్వికులై ఉండేవారు.* మనోహర్ నాయక్ తండ్రి నృసింహ నాయక్ కళ్యాణ్ లో జన్మించారు. ఈయన కేశవనాయక్ పుత్రుడు. కేశవనాయక్ బీదర్ దగ్గరలో ఉన్న ఝరనీ నృసింహ క్షేత్రంలో అనుష్టానము చేసిన తర్వాత పుత్రుడు జన్మించారు. అందుకని నృసింహ నాయక్ అని పేరు పెట్టారు. కేశవనాయక్ సాత్విక గుణసంపన్నులై ఉండేవారు. తండ్రి ఆర్జించిన ఆస్తిలో భాగాలు చేస్తుండగా తనకు ఏదైతే భాగం దక్కాలో అది దక్కదని తెలుసుకొని తనపూర్తి భాగం సోదరుడికి ఇచ్చివేసి కులస్వామి అయిన ఖండేరాయుని విగ్రహంని తీసుకొని హర్ కుడ్ గ్రామాన్ని వదిలి కళ్యాణికి వచ్చి నివసించారు. కేశవనాయక్ తన పుత్రుడైన నృసింహ నాయక్ కి ఉపనయనము చేసి వివాహము చేశారు. నృసింహనాయక్ మరియు బచ్చమ్మల పుత్రుడే మనోహర్ నాయక్. *బచ్చమ్మదేవి హనుమంతుడికి నైవేద్యము పెడితే, హనుమంతుడు ఆరగించిన తర్వాత అన్నం తినేవారని ఒక చరిత్రకారులు వ్రాశారు.*

  బచ్చమ్మకు ఇద్దరు పుత్రులు. మొదట మనోహరనాయక్ తరువాత మార్తాండనాయక్. వీరిద్దరి బాల్యావస్థ దాటకముందే భర్త చనిపోతే కల్యాణికి దగ్గరలో ఉన్న పుట్టిల్లు అయిన 'లాడవంతి'కి వెళ్ళింది. ఈ ధైర్యశాలి అయిన స్త్రీ తన ఇద్దరు పుత్రులకు సరైన రీతిలో మంచి విద్యా బుద్ధులు నేర్పించి విద్యా ప్రవీణులను చేసింది. మనోహరనాయక్ సాత్వికుడై విద్యావేత్తయై బాల్యమంతా లాడవంతిలోనే గడిచిన తర్వాత కల్యాణికి చెందిన అప్పారావు కులకర్ణిగారి పుత్రిక బయమ్మతో వివాహం అయిన తర్వాత మళ్ళీ కల్యాణికి వచ్చి నివసించారు. మనోహరనాయక్ మాతృభక్తి పరాయణులు. తల్లి కనుసన్నులలో పెరగడం వలన వీరి జీవితమంతా ఉదాత్తమైన పనులతో గడిచిపోయింది. వీరి ప్రేమతో లబ్ధిపొందిన వారు వీరి ఉపదేశామృతం కోసం ఆత్రుత పడేవారు. వారిలో అన్ని జాతుల వారు ఉండేవారు. వీరి తమ్ముడైన మార్తాండనాయక్ అల్పవయస్సులోనే మరణించారు. 

   మనోహరుని భార్య బయాదేవి గొప్ప కుటుంబంలోనిది. సుస్వభావము కలిగి ప్రపంచాన్ని పారమార్ధిక ద్రుష్టితో చూసేది. వీరికి క్రీ.శ. 1813 లో ప్రథమ పుత్రుడు జన్మించాడు. హనుమంతుని ఉపాసనతో జన్మించడం వలన 'హనుమంత్' అని పేరు పెట్టారు. వీరిని హనుమంత్ దాదా లేదా దాదామహారాజ్ అని పిలిచేవారు. 

   చాలా మంది చరిత్రకారులు హనుమంత్ రావుని మారుతి అవతారంగా కొలిచేవారు. ఉపనయనము అయ్యే వరకు ఆయన మూగవారిగా ఉండేవారు. తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ కాలానుగుణంగా ద్వివ్యవహారిక చదువు నేర్చారు. ఎప్పుడూ ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవారు.

   మనోహరనాయక్ కుటుంబానికి వారు చేసిన అనుష్టానానికి ఫలం దొరికే సమయం ఆసన్నమైనదని అర్ధమై అంతఃకరణతో ఉన్నతమైన మనోవృత్తితో పారమార్ధిక సంపాదన చేయాలనే తపన ఆ దంపతులకు ఉండేది. వంశం యొక్క, దేశం యొక్క,  ధర్మం యొక్క లోకకళ్యాణం చేసే కొడుకు కావాలని ఏ తల్లికి ఉండదు? కొంతమంది మహాత్ములు సర్వసంపన్నుడైన పుత్రుడు కలగాలని బయమ్మ చేత గోపంచకంతో రొట్టెలు చేసుకొని తినే వ్రతం చేయించారు. ఏది ఏమైనా తమ కడుపులో ఉత్తమమైన కులదీపకులు జన్మించాలని గాఢమైన కోరిక ఉండేది. మనోహరనాయక్ రామభక్తులు. వీరు శ్రీరామనవమి ఉత్సవము చేసేవారు. 1817వ సంవత్సరములో రామనవమి ఉత్సవము పెద్ద ఎత్తున నిర్వహించారు. వీళ్ళ భాగ్యోదయానికి ఈశ్వర సంకల్పము తోడయినది. 

*ఆరోజు వారు కర్తవ్య పరాయుణులై సంతోషంగా ఉండగా మనోహరనాయక్ - బయమ్మ దంపతులకు స్వయంగా శ్రీదత్తాత్రేయ స్వామి, ఉదరంలో జన్మిస్తామని స్వప్నములో సాక్షాత్కరించి చెప్పారు. స్వప్నం వచ్చిన రోజు రామనవమి కాబట్టి మాణిక్ నగర్ లో రామనవమి ఉత్సవం ఇప్పటికీ నిర్వహిస్తారు. సృష్టి నియమానుసారం నవమాసాల తర్వాత 1817వ సంవత్సరము మార్గశిర శుక్ల చతుర్దశి మంగళవారం 22 డిసెంబర్ రోజు రెండవ పుత్రుడు 'మాణిక్' జన్మించారు. ఈ పుత్రుని జన్మతో మనోహరనాయక్ ల కుల, దేశ, ధర్మ మరియు జగత్తు యొక్క ఉద్ధరణ ఎలా జరిగిందో ఈ చరిత్ర ద్వారా ముందు ముందు తెలుస్తుంది.*

తరువాయి భాగం రేపు చదువుకుందాము......

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 3 🌹
✍️. Nagesh  D.  Sonde
📚. Prasad Bharadwaj 

🌻 02. Birth and early life - 1 🌻

In a village called Ladwanti, near the town of Kalyan, in the erstwhile state of Hyderabad, a child was born to a pious couple, Shri Manohar Naik and Smt. Bayadevi. They had in all three sons and one daughter. Amongst the sons, the middle one was the one who was to make history in time to come. He was named Manik.

The child was born on 22nd December, 1817, when the whole town was busy celebrating the birthday of Shri Dattatreya. There was nothing notable in this event and the child grew like any other child in that area. As he grew, one and all were attracted to the child, who was fondled not only by his parents but also by his neighbours. His pranks were endearing to everyone. He started collecting a group of his friends and roaming the hills and dales in the vicinity of the town. He was, as it were, a child of nature, more close to the trees, the breeze, the birds and the flowers.

In the course of play he would occasionally, casually disclose his divinity. Once, when one of his playmates, Govinda, failed to turn up for play for a couple of days, Manik went to his house to enquire after him. Arriving there he heard the sound of wailing from within the house. He was informed that Govinda had passed away after suffering from fever for a few days. Manik told Govinda’s mother to stop grieving as her son was alive. Sure enough, when Govinda’s mother called out to him to go out and play with Manik, he arose as if out of a deep slumber. All present were overjoyed and amazed at this occurrence. This and such other occurrences caused his fame to spread far and wide.

On another occasion, one Bheemabai, a childless woman, the wife of Apparao Arab, a General in the army of the Nizam of Hyderabad, was travelling to visit him to seek his blessings for progeny. On her way she noticed some boys beating up one boy and asked her escort to rescue him. 

The boy who was being beaten up asked for only eight cowries (shells) that he owed the other boys whereby he could get himself released from the other boys. Knowing through divine insight that Bheemabai sought children he promised eight sons for eight cowries. Hearing this, Bheemabai gave him the eight cowries. Thus released, the boy said, “You are given eight sons. You may go!”

When Bheemabai and her entourage reached Manik’s home they discovered that Manik was missing from home for some days. She decided not to have any food until she saw him and waited for his arrival for three days without food and water. Finally, pitying her, Manik returned home. When Bheemabai saw him, who should he be but the boy whom she had rescued on her way here. Manik said, “I have already given you what you seek. Go in peace!” Satisfied Bheemabai left for Hyderabad and in the years to come, she was blessed with eight sons and remained eternally grateful to Manik to the end of her life.

On the whole however, Manik behaved in such a carefree manner that the members of his family were concerned. It was, therefore, decided that at the age of seven his thread ceremony should be performed, so that a sense of responsibility may dawn on this wayward child, who, it appeared, preferred to roam rather than sit and read. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹