శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 2 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 2


🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 2 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
   🌷. మణిచూల పర్వతం 🌷
      నిజాం సర్కార్ లోని రాజ్యంలో గుల్బర్గా, కళ్యాణ్ మరియు బీదర్ ఈ మూడు ఇతిహాస ప్రసిద్ధ క్షేత్రాల మధ్యలో గుల్బర్గాకు తూర్పుదిశలో ఉన్న కొండ ప్రాంతాన్ని 'దరిపట్టి' అంటారు. గుల్బర్గా నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మాణిక్ నగరానికి పైన చెప్పిన మూడు ప్రదేశాలు త్రికోణాకృతిలో ఉన్నాయి. ఈ ప్రదేశంలో మట్టి రంగు ఎర్రగా ఉండి నీరు సమృద్ధిగా, గాలి స్వచ్ఛంగా ఉంటుంది. 

   ఈ ప్రదేశం యొక్క మహాత్మ్యం పౌరాణిక ఇతిహాసంలో కూడా వ్రాయబడింది. మల్హారి మహాత్మ్యంలో మణిమల్లుడు రాక్షసులతో యుద్ధం చేసి, వాడిని పాదాక్రాంతుడిగా చేసుకోవడం జరిగింది. ఈ విషయం శంకరావతార వర్ణనలో వివరించబడింది. ఏ ప్రదేశంలో యుద్ధం జరిగిందో ఆ ప్రదేశం క్షేత్రస్థానం అయ్యింది. అది మైలార్ క్షేత్రంగా ప్రసిద్ధమైనది. ప్రాచీన పౌరాణిక కాలంలో ఈ ప్రదేశాన్ని 'మణిచూల పర్వతం' అని పిలిచేవారు. శ్రీ గురుచరిత్రలో ఈ ప్రదేశాన్ని 'మణిగిరి' అన్నారు. విశిష్ట సాంప్రదాయక పరిభాషలో దీనిని 'వృషభాద్రి' అని కూడా అంటారు. మణిచూల, మణిగిరి, వృషభాద్రి ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధమైన ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం 'దరిపట్టి' అని పిలుస్తారు. *ఇక్కడి గాలి శుద్ధమై, ఆరోగ్యకారక లోహయుక్తమవడం వలన సాధారణంగా శక్తి వర్ధకమైనది. భౌగోళికంగా చూస్తే రెండు శతాబ్దాల పూర్వము ఎలా ఉందో సుమారు ప్రస్తుతం అలాగే ఉంది.*

   ఈ ప్రదేశములో ప్రజలు మరాఠీ, కన్నడ, తెలుగు మూడు భాషలను మాట్లాడతారు. నాల్గవ భాష ఉర్దూ. ఈ ప్రదేశంలోని భూభాగం రక్తవర్ణమైనదని ఇంతకుముందు చెప్పడం జరిగింది. పౌరాణిక కాలంలో జరిగిన కథలో ఖండేరాయుడు, మణిమల్లుడు వారి సైనికులు యుద్ధము చేయడం వలన ఆ సమయంలో పడిన రాక్షసుల రక్తం మట్టిలో కలిసి నేల ఎర్రగా ఉండిపోయింది అంటారు. ఈ విషయం నిజమో కాదో చర్చించడం వలన ప్రయోజనం లేదు. ప్రస్తుతం కూడా భూమి వర్ణం ఎర్రగా ఉందన్న విషయం మాత్రం నిజం. *స్త్రీల సౌభాగ్య కారక చిహ్నం కుంకుమ. అది ఎర్రగా ఉంటుంది. భూదేవి ప్రభువుపై అనురక్తియై వారిని స్వాగతించాలనే ఆత్రుతతో, దివ్య వస్త్రాభరణాలతో, సౌభాగ్య కారక కుంకుమ ధరించి ఆనందంతో తయారై కూర్చున్నది అంటే సరిగ్గా సరిపోతుంది.

   మణిచూల పర్వతం అనేకమంది రత్నాలు జన్మించిన పావనభూమి. ప్రసిద్ధ స్మృతికారులు విజ్ఞానేశ్వరులు ఈ భూభాగంలోనే జన్మించారు. ప్రాచీన కాలంలో పులకేశి రాజు అత్యంత ప్రభావశాలిగా ఉన్నది ఈ ప్రదేశ ప్రభావం వల్లనే. చాళుక్యులు, కళచురీ వంటి అనేక వంశాలు తమ సామ్రాజ్యాలను ఇక్కడ స్థాపించి అన్నివైపులా విస్తరించారు. బీదర్ పట్టణాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి.

  చరిత్రకారులైన విజ్ఞానేశ్వరుల వలెనే లింగాయత్ ధర్మం యొక్క ప్రథమ ప్రవర్తకులు బసవేశ్వరుల అభ్యుదయం ఈ ప్రదేశంలోనే జరిగింది. 

  మాణిక్ ప్రభువుకు పెట్టిన పేరు మాణిక్ అయినా కూడా వారి నాయనమ్మ, తల్లితండ్రులు 'రత్నా' అని ముద్దుగా పిలిచేవారు. మాణిక్ అనేది వ్యవహారంలో ఒక రత్నం యొక్క పేరని అందరికీ తెలుసు. ఈ రత్నం యొక్క రంగు కూడా ఎర్రగా ఉంటుంది. ఎర్ర రంగు పవిత్రమైనది.
  ఈ విధంగా మణిచూల పర్వతం ప్రేమతో ఆకర్షించి ప్రభువు జన్మించడానికి ప్రేరణయై వారి క్రీడాస్థానం మరియు శాశ్వత నివాస స్థానమయ్యింది. *ఈ పర్వత శిఖరం పై దత్తావతారులైన శ్రీ ప్రభువు గాదీ స్థాపన జరిగింది. సకలమత సంప్రదాయ దుందుభి మోగిస్తూ, సమతాభావం యొక్క జెండా ఆకాశంలో ఎగురుతూ ఉంది. అన్ని ధర్మాలు, మతాలు ప్రేమ అనే పీఠంపై సమత అనే జెండా కిందకు వచ్చి అక్షయమైన ఆనందాలతో ఉండాలని ప్రభువు అనుకున్నారు.
తరువాయి భాగం రేపు చదువుకుందాము....... 
ఓం సాయిరామ్ 
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 
🙏🙏🙏🙏🙏🙏

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 2 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj 

🌻 01. Introduction - 2 🌻

As time passed, Dattatreya was seen as a great sage, a Yogi, a Jeevanmukta, a Paramahamsa. In the triple combination of Satya-Rta-Dharma, he saw the inalienable equipoise, Samatvam and equanimity, Samanvaya. 

All distinctions and distractions that arose in human enterprise were seen entirely due to AJnana, the non-awareness of the human being of his true identity with Blissful Brahman. The concept of Avatar, the descent of the Divine, does not accept any contradiction. 

While it is not denied that the entire creation is due to and at the instance of the Supreme Brahman, emergence of some distinctive energy and specific form, in intensity only proves the need, the occasion and the time. In fact the descent of the Divine in human form is to create conditions for the human to ascend to his Divine essence. 

Everything that happens is but the expression of the Divine Will and the descent of the Divine Energy and the ascent of the Human aspiration are mutually complementary. 

Shri Krishna has made it abundantly clear in Bhagavad Gita (IV.7-8), that “Whenever there is decline in righteousness and rise in unrighteousness, O Bharata, then I send forth Myself. For the protection of the good and the destruction of the evil and the establishment of righteousness, I come into being from age to age”. 

He has also given an indication of the time when he decides to come, the time when Vishaya-Vasana, allurement to the objects of the senses overshadows ‘Nitya-Anitya Viveka’, discrimination of the eternal and non-eternal. 

In such event, we should seek to find the redeeming feature in the essence and presence of Divine potency. “Whatsoever being there is endowed with glory and grace and vigour, know that to have sprung from a fragment of My splendour” (Bhagavad Gita X.41). 

When we see in this context, the life and the message of Shri Manik Prabhu Maharaj, we see many similarities between his life and the life of Shri Dattatreya. In fact it would not be incorrect to say that Lord Dattatreya himself, out of compassion took descent in the form of Shri Manik Prabhu Maharaj. 

If we consider the time of Shri Prabhu’s birth we realise that religious hatred, social inequality and a total cultural chaos was the order of the day. The seekers of true knowledge were in a confused state of mind and ran from pillar to post in search of spiritual solace. 

 The purpose of having a Guru or surrendering to him, is not to be possessed with a crutch on which we can lean, but to have guidance and grace for traversing the Path of Truth, which embraces Universal Essence, SAKALAMATA. 

Only when we have the Shraddha, the receptivity, towards our Guru and His Message, we can hope to live the life of Samatvam or Samanvaya, which is the purpose for which Shri Dattatreya took descent in the form of Shri Manik Prabhu Maharaj. Therefore, as Shri Krishna recommended, we should approach the wise Teacher. 

 “Learn THAT (Eternal Truth, the Brahman) by humble reverence, by inquiry and by service. The men of wisdom who have seen the Truth will instruct you in that wisdom” (Bhagavad Gita IV.34). 

We shall thus approach Shri Manik Prabhu Maharaj, the descent of Shri Dattatreya, to understand and to be initiated in the Sakalmata Sampradaya, which indeed is the need of this age.

Continues......
🌹 🌹 🌹 🌹 🌹