త్రిపురా రహస్యము - 1 / Tripura Rahasya - 1
🌹. త్రిపురా రహస్యము - 1 / Tripura Rahasya - 1🌹
🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 ప్రస్తావన 🌴
'నమస్మారం గురుదేవా!” రెండు గొంతులు ఒక్కసారిగా పలికేటప్పటికి ఉలిక్కిపడితలఎత్తి చూశాడు రత్నాకరుడు.
ఎదురుగా వినమ్రులై, చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడి ఉన్నారు తన శిష్యులు కృష్ణశర్మ, నారాయణభట్టు.
చాలా కాలానికి వచ్చిన శిష్యులను చూసి పరమానందభరితుడైనాడు రత్నాకరుడు.
కుశలప్రశ్నల అనంతరము అడిగాడు ఏ పనిమీద వచ్చారు ?' అని.
“గురువర్యా ! ఇప్పటిదాకా మీ వద్ద ఉపనిషత్తులు చెప్పుకున్నాం బ్రహ్మసూత్రాలుచెప్పుకున్నాం, శ్రీవిద్యలో అనేక గ్రంథాలను చెప్పుకున్నాం. ఇప్పుడు 'త్రిపురా రహస్య దీపిక' అనే జ్ఞానఖండాన్ని చెప్పుకుందామని వచ్చాం, కాబట్టి, కాదనక మమ్ములను కృతార్ధులను చెయ్యండి” అన్నారు శిష్యులు.
ఆ మాటలకు, శిష్యుల యొక్క జ్ఞానజిజ్ఞాసకు ఆనందించినవాడై ఇవాల్టికి సెలవుతీసుకుని రేపు రండి అన్నాడు రత్నాకరుడు. అనుకున్న ప్రకారం మర్నాటి సాయం సమయానవచ్చిన శిష్యులు, గురువు గారికి సాష్టాంగ ప్రణామాలర్పించి, ఆయన అనుమతితోసుఖాసీనులైనారు.
రత్నాకరుడు అమితమైన ఆదరంతో తన శిష్యులకు 'త్రిపురా రహస్యదీపిక'అనే జ్ఞానఖండాన్ని అందించటానికి ఉద్యుక్తుడౌతున్నాడు.
ఓం నమః కారణానంద రూపిణీ పరచిన్మయీ |
విరాజితే జగచ్చిత్ర చిత్ర దర్పణ రూపిణీ ॥
ఓంకార స్వరూపమైనది, చరాచర జగత్తుకు కారణ భూతమైనది, పరబ్రహ్మస్వరూపమైనది, దేశకాల వస్తువులచే పరిమితము కానిది, స్ధావర జంగమాత్మకమైనజగత్తు అనే చిత్రమును ప్రతిబింబింపచేసే దర్పణము వంటిది, సర్వోత్కృష్టమైనది, మిక్కిలి ప్రకాశవంతమైనది అయిన ఆ త్రిపురాదేవికి నమస్కరిస్తున్నాను.
త్రిపురాదేవి - త్రిపురములకు అధిపతి, ముల్లోకములకు అధిపతి. భూలోక, భువర్లోక, సువర్లోకాలను ముల్లోకాలు అంటారు.
మూడు లోకాలకు అంటే, జగత్తులోఊర్బ్వలోకాలు ఏడు, అధోలోకాలు ఏడు మొత్తం పద్నాలుగు లోకాలున్నాయి. వాటిలోముఖ్యమైనవి మూడు.
ఆ దేవి మూడు లోకాలకు అధిపతి అంటే మిగిలిన మొత్తం లోకాలకు కూడా ఆధిపత్యం ఆమెదే అనే మాట వేరే చెప్పనవసరం లేదు. కాబట్టి త్రిపురాదేవిఅంటే - ఈ జగత్తు కంతటికీ అధిపతి అయిన పరమేశ్వరి అని అద్ధం.
ఆమె యొక్కమాహాత్య శ్రవణం మోక్షదాయకం. ఆ పేరు తలచినంతనే పాపాలు పటాపంచలై పోతాయి.
ఇక త్రిపురా రహస్య దీపిక అనేది జ్ఞానఖండము. ఇది మహాద్భుత మైనది. దీనిని విన్నవారికిసుఖదుఃఖాలు ఉండవు. రాగద్వేషాలు నశిస్తాయి. మరుజన్మ ఉండదు. ఇది సర్వవేదాలసారము. సర్వమతాల అంటే శైవము, వైష్ణవము, సౌరము, గాణాపత్యముల యొక్కసారము.
దీన్ని దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్పాడు. దానినీ నేను మీకు వివరిస్తున్నానువినండి అంటూ త్రిపురా రహస్యదీపిక చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు.
“బుచీకుడు' అనే మహర్షి కుమారుడు జమదగ్ని. జమదగ్ని కుమారుడుపరశురాముడు. ఇతని అసలు పేరు 'రాముడు. ఇతడు హిమాలయ పర్వతాలలో ఈశ్వరుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సునకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఈతనికి పరశువునుబహుమతిగా ఇచ్చాడు. అప్పటినుంచి ఈ రాముడు పరశురాముడైనాడు.
గాధిరాజు కుమార్తె సత్యవతి. ఈమెను “బుచీకుడు' వివాహం చేసుకున్నాడు. ఈమె చాలా పతివ్రత. ఈమె భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు బుచీకమహర్ని.
సత్యవతి ఆలోచించి తనకొక కుమారుడు, తన తల్లికి ఒక కుమారుడు కలిగేటట్లుగావరమడిగింది. మహర్షి రెండు పాత్రలలో మంత్ర జలాన్నిఇచ్చి చెరి ఒక పాత్ర త్రాగమన్నాడు.
కాని ఆ పాత్రలను తీసుకునే సమయంలో పొరపాటున ఒకరి పాత్ర ఒకరు తీసుకోవటం జరిగింది. అది తెలుసుకున్న బుచీకుడు సత్యవతితో, 'నీ గర్భాన క్షత్రియుడు, నీ తల్లి గర్భాన బ్రాహ్మణుడు జన్మిస్తారు అన్నాడు. ఆ మాటలకు విచారించిన సత్యవతి క్షత్రియుడు నాగర్భాన కాక, నా కుమారుని గర్భాన అవతరించేటట్లుగా అనుగ్రహించమని వేడుకున్నది.
అనుగ్రహించాడు బుచీకుడు. అప్పుడు సత్యవతి తల్లి గర్భాన పుట్టినవాడే విశ్వామిత్రుడు.
సత్యవతి గర్భాన పుట్టినవాడు జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరశురాముడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 TRIPURA RAHASYA - 1 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj
CHAPTER - 1
1. Salutation to Aum (undifferentiated Brahman, and yet the) Primal and Blissful cause, the transcendental consciousness shining as the unique mirror of the wonderful universe:
Note: — The one undifferentiated Brahman signified by Aum polarises as Sat-chit-ananda taking shape as Parameswari who, in Her crystal purity, displays the variegated phenomena which gyrate in equipoise within Her. Neutral Brahman and the polarised Brahman are thus interchangeable. The idea of the mirror implies the non-separateness of the object from the subject (conscious being).
2. (Harithayana said :
"Undisturbed you have heard, O Narada! the Mahatmya (The Gospel) of Sri Tripura, which teaches the way to Transcendence."
Note: — Thus begins the latter part of the book; the first part deals with a narrative of Devi (Sakti — Sri Tripura), Her worship and Her grace. Tripura literally means the three cities. They are the states — Jagrat, Svapna and Shushupti. The undercurrent of consciousness in all of them, remaining unaffected, is metaphorically called the Resident Mistress by name Sri Tripura. The procreative faculty generating new beings and the link of altruistic love connecting the offspring to the parent are personified in the Mother. Hence the feminine termination of Tripura. "The way to transcendence" signifies that interest in Tripura purifies the mind and creates the zeal for enquiry into the Truth. The listener is now fit for the ensuing discourse on wisdom.
3. I shall now discourse on wisdom, which is unique because one will be permanently freed from misery, by hearing it.
4. This is the concentrated extract of the essence of the Vedic, Vaishnava, Saiva, Satkta and Pasupata lore taken after a deep study of them all
5-7. No other course will impress the mind so much as this one on Wisdom which was once taught by that illustrious master Dattatreya to Parasurama. The teaching was born of his own experience, logical in sense and quite unique in its nature. One who cannot apprehend Truth even after hearing this must be dismissed as a silly fool to be ranked among the insentient and accursed of God; Siva himself cannot make such an one gain wisdom.
8. I now proceed to relate that incomparable teaching. Listen! Oh, the lives of Sages are most sacred!
9-11. Narada too served me to learn the same from me; for, service to sages enables one to apprehend their innate kindness, just as the sense of smell helps one to detect the intrinsic odour of musk.
As Parasurama, the son of Jamadagni, already pure-minded and pleasing to all, was listening to the Gospel of Tripura from the lips of Dattatreya, he became abstracted in devotion and so growing still for a time, his mind became still purer.
12-13. Then as the mind relaxed, his eyes glowed in rapture and his hair stood on end, as if his ecstasy could not be contained within but must escape through the very pores of his body. He then fell to the ground before his master Datta.
🌹 🌹 🌹 🌹 🌹