త్రిపురా రహస్యము - 61 / TRIPURA RAHASYA - 61

Image may contain: 3 people
🌹. త్రిపురా రహస్యము - 61 🌹
🌻. స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌴. జ్ఞానభేధాలు -మోక్షసాధనాలు - 1   🌴 
 
గురువుగారూ ! ముక్తి కలిగినప్పుడు లోకవ్యవహారము ఏ విధంగా ఉంటుందో వివరించాడు కదా దత్తాశక్రేయుడు. దాంతోనైనా పరశురాముడి అనుమానం పూర్తిగా  తీరిందా ? ఆ తరువాత ఏం జరిగింది ? అంటూ అడిగాడు కృష్ణశర్మ చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. 
 
దత్తాత్రేయుడు చెప్పిన మాటలతో పరశురాముడు తృప్తి చెందలేదు. మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. 

ఆచార్యదేవా ! బుద్ది భేదాన్ననుసరించి జ్ఞానంలో తేడా ఉంటుంది అన్నారు. జ్ఞానము అంటే ఆత్మ ప్రకాశమేకదా ? ఇక మోక్షమే అందరూపొందదగినది. మరి అలాంటప్పుడు బుద్దిభేదాన్ననుసరించి జ్ఞానంలో తేడా ఎలా ఉంటుంది ? జ్ఞానసాధనాలలో కూడా తేడాలుంటాయి ? వివరించండి అన్నాడు. ఆ మాటలు విన్న దత్తాత్రేయుడు, తన శిష్యుని అనుమానం తీర్చటానికి ఉద్యుక్తుడౌతున్నాడు. 
 
జ్ఞానసాధనాలలో ఉందే తేడాని బట్టి ఫలటప్రాప్తిలో తేడా ఉంటుంది. సాధన పరిపూర్ణమైతే ఫలితం తేలికగా వస్తుంది. అసలు జ్ఞానమనేది సత్యసిద్ధమే. కాబట్టి దానికి సాధనాపేక్ష ఏ మాత్రం లేదు.

 జ్ఞానమనేది ఎప్పుడూ సాధ్యంకాదు. అది విజ్ఞాన చైతన్యము. ఎల్లప్పుడూ స్వప్రకాశమే. నిత్యప్రకాశమైన దానికి సాధనతో పనేమిటి ? స్పటికతో చేసిన పెట్టెలో పద్మరాగమణి ప్రకాశించినట్లుగా, స్వచ్చమైన చిత్తంలో చెతన్యం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. కాని స్పటికం మీద మట్టిపడితే, లోపల మణి కనపడదు. అలా వాసనలు, మనసును కమ్మితే చైతన్యం ప్రకాశించదు. 
 
తుప్పు పట్టిన పెట్టె మూత అతుక్కుపోయినట్లుగా దేహంతో తాదాత్యం చెందటంతో చిత్తం మూసుకుపోతుంది. అప్పుడు మనోనిరోధము అనే నీటిధారతో అజ్ఞానమనే బురదను కడిగి వెయ్యాలి. శ్రవణము మననము అనే పదునైన సానరాయితో దేహ తాదాత్య భావం అనే తుప్పను వదిలించాలి. తరువాత యుక్తి అనే తాళం చెవితో చిత్తమనే పెట్టెను తెరవాలి. అప్పుడు పద్మరాగమణీిలాగా చైతన్యం స్వచ్చంగా ప్రకాశిస్తుంది. అందుకని సాధన అనేది వాసనలను అరికట్టటానికే. అంతేకాని జ్ఞానానికి సాధన అవసరం లేదు. వాసనల ప్రభావం ఎక్కువగా ఉంటే సాధన ఎక్కువ కావాలి. 
 
ప: గురువర్యా ! వాసనలు అన్నారు కదా ! వాటిని వివరించండి. 
 
ద: వాసనలు ముఖ్యంగా మూడు రకాలు. వీటినే త్రివిధ వాసనలు అంటారు. అవి వరుసగా 1) లోకవాసన 2) శాస్తవాసన 3) దేహవాసన ఇవే కాకుండా అపరాధము, కర్మ, కామము అని మూడు రకాలున్నాయి. 
 
1. అపరాధము: గురువుయొక్క మాటలలో విశ్వాసం లేకపోవటమనేది అపరాధం. ఇది ఆత్మవినాశనము, 
 
విపరీత గ్రహణమనేది కూడా అపరాధవాసనే. విపరీత గ్రహణం మూడు రకాలు అవి 
 
1. నిర్విశేషమైన బ్రహ్మము లేదు. అది ఉండటం అసంభవం. 
 
2. నిర్విశేష బ్రహ్మ ఉన్నది. కాని దాన్ని తెలుసుకోవటం సాధ్యం కాదు. 
 
3. శ్రవణమననాలద్వారా కొందరికి తత్త్వదర్శ్భనం కలుగుతుంది. కాని అది యదార్ధమైన పరతత్త్వం కాదు. 
 
2. కర్మవాసన : పూర్వంచేసిన కర్మలవల్ల మనసులో మాలిన్యం ఏర్పడుతుంది. అందువల్ల గురువు ఎంత బోధించినా బుద్దికి ఎక్కదు. దిన్నిజయించటం కష్టం. ఇవి అనంతముగా ఉంటాయి. కాబట్టి వీటిలో కొన్ని నశించినా ఇంకా కొన్ని కొత్తగా వస్తుంటాయి. ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టవచ్చు కాని ఈ కర్మవాననలను 
అధిగమించటం మాత్రం కష్టము,  
 
3. కామవోసన : ఇది చాలా పెద్దది. ఆకాశంకన్న విశాలంగా ఉంటుంది. పర్వతంకన్న నిశ్చలంగా, ఎత్తుగా ఉంటుంది. ఇదే 'ఆశ' ఈ ఆశాపిశాచివల్లనే లోకంలో అంతా పిచ్చివారవుతున్నారు. కేవలం వైరాగ్యంతో మాత్రమే దీన్ని జయించగలము. 

పరశురామా ! ఈ వాసనాత్రయం మనసుకు ఆక్రమించినందువల్ల ఆత్మతత్త్వం కలగదయ్యా వీటిలో మొదటివాసన అయిన. 
 
1. అపరాధాన్ని - గుర్తించి సరిచేసుకోవాలి. 
 
2. కర్మవాసన - ఈశ్వరానుగ్రహంతో పోతుంది. 
 
3. కామవాసన - వైరాగ్యంవల్ల నశిస్తుంది. 
 
అన్ని సాధనలలోకీ మొట్టమొదటిది ముముక్షుత్వం మోక్షం పొందాలనే కోరిక. ఇది గనకలేకపోతే ఇంకా ఏ సాధనాలు ఉపయోగం ఉండవు. ముముక్షుత్వం లేని శ్రవణము, మననము మొదలైనవి శవానికి చేసే అలంకారాలవంటివి. కేవలం శ్రవణాదులవల్లనే మోక్షం రాదు. 
 
ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నప్పుడు జగత్తు అంతా మిధ్య. బ్రహ్మ ఒక్కటే సత్యము అనిపిస్తుంది. మోక్షకాంక్ష కలుగుతంది. అది కేవలము తాక్కాలికము. దానివల్ల ఫలితముండదు. ఈ కోరిక ఎంత తీవ్రమైతే అంత త్వరగా ఫలితముంటుంది. మోక్షం కన్న ఇతరమైన వాటియందు ఆసక్తిలేని ఇచ్చనే 'తత్సరత్‌” అంటారు. అదే మోక్షఫలాన్ని సాధిస్తుంది. 
 
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 61 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj

CHAPTER 14
🌴 The Highest Truth - 4 🌴

75. Therefore the mind (chitta) is purusha (the individual) when the sentient phase is assertive, and the same is avyakta (unmanifest) when prakriti (nature), the insentient phase, is assertive. 

76. That chitta is tripartite according to its functions, namely, ego, intellect and mind. 

77. When influenced by the three qualities, it manifests in greater details as follows: by sattva (brightness), it becomes the five senses, hearing, sight, touch, taste and smell; by rajas (activity) speech, hands, feet, organs of excretion and of procreation; by tamas (darkness) earth, air, fire, water and ether. 

78. The supreme intelligence coquettes with the universe in this manner, remaining all the time unaffected, a witness of its own creation. 

79. The present creation is the mental product of Brahma or Hiranyagarbha, appointed creator by the willforce of the Primal Being, Sri Tripura. 

80. The cognition ‘you’ and ‘I’ is the essence of any kind of creation; such cognition is the manifestation of transcendental consciousness; there cannot be any difference (just as there is no difference in space, bounded by a pot or not bounded by it). 

81. The diversities in creation are solely due to qualifications limiting the consciousness; these qualifications (e.g., body, limiting of age) are the mental imagery of the creator (consistent with the individual’s past merits). When the creative will-force wears away there is dissolution and complete undifferentiation results. 

82. As for your willpower, it is overpowered by the Creator’s; when that impediment (Maya’s veiling) is surmounted by the methods already mentioned, your willpower will also become effective. 

83. Time, space, gross creations, etc., appear in it according to the imagery of the agent. 

84-86. A certain period is only one day according to my calculation, whereas it is twelve thousand years according to Brahma: The space covered by about two miles and a half of Brahma is infinite according to me and covers a whole universe. In this way, both are true and untrue at the same time. 

87-88. Similarly also, imagine a hill within you, and also time in a subtle sense. Then contemplate a whole creation in them; they will endure as long as your concentration endures — even to eternity for all practical purposes, if your willpower be strong enough. Therefore I say that this world is a mere figment of imagination.

89. O King! It shines in the manifest conscious Self within. Therefore what looks like the external world is really an image on the screen of the mind. 

90. Consciousness is thus the screen and the image, and so yogis are enabled to see long distances of space and realise long intervals of time. 

91. They can traverse all distance in a moment and can perceive everything as readily as a gooseberry in the hollow of one’s palm. 

92. Therefore recognise the fact that the world is simply an image on the mirror of consciousness and cultivate the contemplation of ‘I am’, abide as pure being and thus give up this delusion of the reality of the world. 

93-97. Then you will become like myself, one in being, self-sufficient. Dattatreya continued: On hearing this discourse of the sage’s son, the king overcame his delusion; his intellect became purified and he understood the ultimate goal. Then he practised samadhi, and became self-contained, without depending on any external agency, and led a long and happy life. He ceased to identify himself with the body, and became absolute as transcendental space until he was finally liberated. So you see, Bhargava, that the universe is only a mental image, just as firm as one’s willpower, and no more. It is not independent of the Self. Investigate the matter yourself, and your delusion will gradually lose hold of you and pass off. 

Thus ends the Chapter 14 on “The Story of the Hill City” in Tripura Rahasya.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹