త్రిపురా రహస్యము - 60 / TRIPURA RAHASYA - 60

🌹. త్రిపురా రహస్యము - 60 🌹
🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. సమాధి స్థితి - 10 🌴
🌴. దృక్కు - దృశ్యము - 6 🌴
పరశురామా ! లోకంలో అజ్ఞానులు నత్యాసత్యాలకున్న తేడా తెలుసుకోలేక పోతున్నారు. ఈ జగత్తే సత్యము అనుకుంటున్నారు. అన్ని కాలాలలోనూ ఉండేదాన్నే సత్యము అంటారు. చితి ఎప్పుడూ ప్రకాళిస్తూనే ఉంటుంది. అందుకే దాన్ని సత్యము అంటారు. చితి ప్రకాశించకపోతే అసలు కాలమే ప్రకాశించదు.
ప : చితి ఎల్లప్పుడూ (ప్రకాశిస్తుంది అన్నారు నిజమే. అది సత్యమే. అయితే సత్యాసత్యాలకు భేదం ఏమిటో తెలియజెయ్యండి.
ద: రామా! ఇతరాపేక్ష లేకుండా ప్రకాశించేది సత్యం. ఇతరాపేక్షతో ప్రకాశించేది అసత్యం. లేదు అనేది లేనిది సత్యము. లేదనే మాట ఉన్నది అసత్యం. ఒక్కొక్కసారి లేనిది కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకె అసత్యాన్ని సత్యం అనుకుంటారు. కాని నిదానంగా విచారిస్తే విషయం బోధ పడుతుంది.
చితిప్రకాశం లేకపోతే ఏదీ ఉండదు. అసలు “ఏదీ ఉండదు” అనే జ్ఞానమే ఉండదు. ఏదైనా ఒక వస్తువు లేదు అన్నామంటే అది అసలు ఉన్నదన్నమాట. కాని ఇప్పుడు లేదు. అంతేకాని ఉన్నదాన్ని లేదనటం జరగదు. ఇక్కడ చితి తప్ప ఇంకేదీ లేదు. ఉన్నది ఒక్కటే పరాచితి త్రిపురాసుందరి.
జగత్తులోని విషయాలన్నీ భ్రమే. లోకంలోని విషయాలను (ప్రమాణాలు అనుకోవటం మహాభ్రమ. “అది నిజం కాదు” అని తెలిసేవరకు ఈ (భ్రమే ఉంటుంది. ముత్యపు చిప్పను చూసి వెండి అనుకుంటాము. అది వెండి కాదు అని కేలిసేవరకు ఆ భ్రమ అలానే ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞానం కలిగేదాకా ఉండే లోకజ్ఞానం అంతా భ్రమే.
అయితే ఈ భ్రమ అందరికీ కలుగుతుంది. ఆకాశం నీలంగా ఉంది. ఇది సత్యము అనే భ్రమ అజ్జానంవల్ల అందరికీ కలుగుతుంది. చిదాత్మరూపంగా ఉన్న విజ్ఞానం ఒక్కటె ప్రమాణమైన జ్ఞానం ఈ జగత్తులో చిదాత్మ ఒక్కటే నత్యము నిత్యము, ప్రమాణమైనదని తెలునుకో.
ప : గురుదేవా ! చిన్న ప్రశ్న. ముక్తి కలిగినప్పుడు లోకవ్యవహారం ఎలా ఉంటుంది?
ద : ముక్తులైన జ్ఞానులు మూడు రకాలుగా ఉంటారు.
1. ఆత్మస్వరూపం తెలిసినా ప్రారబ్దంవల్ల వచ్చిన విషయభోగాలతో ప్రతిక్షణమూ శతమతమయ్యేవారు అధములు.
2. పప్రారబ్బ్దంవల్ల భోగాలనుభవిస్తూకూడా, నిరంతరం సమాధిస్థితిలోనే ఉంటూ ఆత్మానందాన్ని అనుభవించేవారు మధ్యములు. వీరుపైకి మాత్రం సామాన్యులవలె కనిపిస్తారు.
3. కర్మఫలాన్ని అనుభవిస్తూ, సమాధిలోనే మనన్సు ఉంచి సుఖదుఃఖాలకు అతీతులుగా ఉంటూ లోకంలోని అందరినీ సమానంగా చూచేవారు ఉత్తములు.
ఈ విధంగా వారి బుద్ది, ప్రారబ్ద కర్మలలో తేడాలను బట్టి వారు వ్యవహరిస్తుంటారు” అని చెప్పాడు అని చెబుతూ పద్దెనిమిదో అధ్యాయాన్ని పూర్తిచేశాడు రత్నాకరుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 TRIPURA RAHASYA - 60 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj
CHAPTER 14
🌴 How the Universe is Mere Imagination; How to Gain that Strong Will which Can Create It; and the Highest Truth - 3 🌴
59-60. This is the first step in creation; it is called ignorance or darkness. Starting as an infinitesimal fraction of the whole, it manifests as though external to its origin, and is a property of the ego-sense. The alienation is on account of the latent tendencies to be manifested later. Because of its non-identity with the original consciousness, it is now simple, insentient energy.
[Note: The commentary has it: What is absolute consciousness goes under the name of Maya just before creation, and is later called Avidya (or ignorance) with the manifestation of the ego. The agitation in the quietness is due to subtle time fructifying the latent tendencies of the ego, which had not merged in the primordial state at the time of the dissolution of the universe.]
61. That consciousness which illumines the ‘exterior’ is called Sivatattva, whereas the individual feeling as ‘I’ is Saktitattva.
[Note: Siva is awareness of the ‘exterior’; Sakti is the dynamic force operating the potential tendencies in the individual self.]
62. When the awareness of the ‘exterior’, combined with the ‘I’, encompasses the entire imagined space as ‘I’, it is called Sada-Siva-tattva.
63. When, later, discarding the abstraction of the Self and the exterior, clear identification with the insentient space takes place, it is called Ishwara-tattva. The investigation of the last two steps is pure vidya (knowledge).
64. All these five tattvas are pure because they relate to an as-yet-undifferentiated condition, like potentialities in a seed.
65. After the differentiation is made manifest by willforce the insentient part predominates over the other, as opposed to the contrary condition before. 66. That insentient predominance is called Maya Sakti, after differentiation is clearly established, like the sprout from a seed.
67-69. The sentient phase now contracts, being relegated to a minor position and takes on the name of Purusha, being covered by five sheaths, namely kala (something of doership), vidya (some knowledge), raga (desire), kala (time — allotted life) and niyati (fixed order of things).
70. Anamnesis of individuals made up of the proclivities acquired as a result of engaging in diverse actions in previous births, is now supported by intelligence and remains as prakriti (nature).
71. This prakriti is tripartite because the fruits of actions are of three kinds: She manifests as the three states of life, wakefulness, dream and deep sleep. She then assumes the name, chitta (mind).
72. The anamnesis goes by the name of Prakriti in dreamless slumber, and Chitta in the other states. It is always comprised of the insentient phase of the proclivities of the mind and the sentient phase of intelligence.
73. When the proclivities still remain in abeyance without being used up, its totality is called avyakta (unmanifested); differences arise only in chitta.
74. There is no difference among individuals in sleep and so it is prakriti, the same assuming the name of chitta when differences manifest.
[Note: Sleep is characterised by undifferentiation and so it is the same for all, irrespective of propensities of the mind. Simultaneous with the awareness of the body the other states manifest. Individual enjoyments — pleasure and pain — lie only in the wakeful and dream states, according as the innate tendencies of the mind mature and yield fruits. When one crop is over, sleep supervenes, and then there is no enjoyment and no distinction according to crops. As the anamnesis is ready with the next crop, sleep is shaken off and differences arise. So it is clear how the one undifferentiated condition manifests as the universe in all its diversity and resolves into itself periodically.]
Continues...
🌹 🌹 🌹 🌹 🌹