త్రిపురా రహస్యము - 59 / TRIPURA RAHASYA - 59

Image may contain: 3 people
🌹. త్రిపురా రహస్యము - 59 🌹
🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻

✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. సమాధి స్థితి - 9 🌴
🌴. దృక్కు - దృశ్యము - 5 🌴

ప : మనసు ఆత్మ ఒకటే అయితే, ప్రమాత, ప్రమాణము అనే భేదము ఎలా కుదురుతుంది ? 

ద: ఆకాశంలో ఉన్న జడశక్తిని ప్రధానంగా తీసుకున్నప్పుడు మనస్సును ప్రమాణము అని, దానిలోని చిచ్చక్తిని గ్రహించేటప్పుడు ఆ మనస్సునే ప్రమాత, జీవుడు అని అంటున్నాము. ఆకాశం మిక్కిలి కోమలంగాను, శిధిలంగాను, నిర్మలంగాను ఉంటుంది. దీనిలో కారిన్యము, నరళత్వము, ఘనత్వము కల్పన చేసినప్పుడు పంచభూతాలు అఆవిర్భవిస్తాయి. అది ఏ రకంగా అంటే - 

1. ఆకాశానికి స్పర్శ కలిగించినప్పుడు - వాయువు అవుతుంది 

2. వాయువుకు సంశ్లేషాన్ని కలిగిస్తే - అది తేజస్సు అవుతుంది ఆ తేజస్సులో ఘనత్వం లేదు. 

3. తేజస్సుతో ఘనత్వాన్ని కల్పన చేస్తే - జలం అవుతుంది జలానికి ఘనత్వ్పమున్నది. అందుచేతనే నీటిపైనగాని, నీటిలోపలగాని కొట్టటం అనేది సాధ్యమవుతోంది. 

4. నిర్మలంగా ఉన్న జలానికి మాలిన్యం కలిగిస్తే - పృధివి అవుతుంది. పృథివిలో నిర్మలత్వం లేదు. నీళ్ళలో కుండను ముంచితే కుండ కనిపిస్తుంది. అదే కుండను మట్టితో కప్పితే కుండ కనపడదు. 

పంచభూతాలతో ఆవరించినప్పుడు దేహాతాదాత్మ భావం కలుగుతుంది. అప్పుడు దాన్ని దేహాత్మ అంటారు. ఈ భావం పొందినా చితి తన స్వరూపాన్ని వదలదు. ఒక దీపాన్ని తెచ్చి కుండలో పెట్టినంత మాత్రంచేత, అది వెలగకుందా ఉండదు. దాని కాంతి కుండంతా వ్యాపిస్తుంది. చిల్లుల గుండా బయటకు ప్రసరిస్తుంది. అలాగే ఆత్మదేహంలో ఉన్నా, దేహమంతా వ్యాపించి ఉంటుంది. చెవులు, కళ్ళు మొదలైనవాటి ద్వారా బయటకు ప్రసరిస్తుంది. దీనివల్ల నిష్కియత్వం గల చీకటి నశిస్తుంది. ఈ ఆత్మ జదడరూపమైన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. దాన్నే “చిత్రకాశ ప్రసారము” అంటారు. పరశురామా ! మనస్సంటూ విడిగా లేదు. ఆత్మే మనస్సు. 

స: చలనము అంటే ఏమిటి ? 

ద; స్పూర్తితో ఆవరణ భంగం చెయ్యటమే చలనము. దీన్నే వికల్పము అనికూడా అంటారు. ఈ వికల్పం గనకపోయినటైతే, చితిలో ప్రకాశించే పరిచ్చేదం అంటే - విభాగము పోతుంది. అంటే అల్పజ్ఞానం తొలగిపోతుంది. కేవలం పరిపూర్ణమైన విజ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ విజ్ఞానమే మోక్షసాధనము. 

ప: ఒకవేళ వికల్పాలను వదలివేసినా, ఆవరణ శేషం ఉండచ్చును కదా ? 

ద: పరశురామా ! అసలు ఆవరణ అనేదే లేదు. ఆవరణ అనేది నిజం కాదు. అది మనం కల్పించిందే. ఇదంతా పగటికలలాంటిది. కలలో అతజ్తి శత్రువు బంధించి బాధిస్తున్నారు. కలను వదిలేస్తే బాధ ఉండదు. ఇది కూడా అంతే. ఆవరణ అనేది కల్పన ఉన్నంతవరకే ఉంటుంది. కల్పన పోతే బంధనాలుండవు. అసలు విచిత్రము తెలుసా ? “బంధమే నత్యము” అనే నమ్మకమే మహాబంధమయ్యా, కాబట్టి బంధనాలను వదలిపెట్టు. ఈ బంధనాలున్నంతవరకు గురువుగాని, త్రిమూర్తులుగాని చివరకు పరమేశ్వరి కూడా సంసారాన్ని నాశనం చెయ్యలేదు. 

నిర్వికల్ప దశలో మనస్సు ఉన్నప్పటికీ, అది ఆత్మస్వరూపమే కాబట్టి ద్వైతమనే ప్రసక్తి లేదు. ఇది, అది అనే రూపంతో భాసించే జ్ఞానమే మనస్సు. అది, ఇది అనేవి గనకపోతే మిగిలేది శుద్ధజ్ఞానమే. అదే ఆత్మ. అంటే మనస్సే ఆత్మ అయినప్పుడు ఇక ద్రైతమెక్కడుంటుంది ? 

ప: గురుదేవా ! రజ్జు సర్పభ్రాంతి కలిగింది. అంటే రజ్జువును ఆధారంగా చేసుకుని సర్పభ్రాంతి కలిగింది. తరువాత భ్రాంతిపోయింది. ఆ తరువాతకూడా రజ్జువు, అనే జ్ఞానం ఒకటి ఉన్నది కదా ! అది ఆత్మకన్మ భిన్నమైనదే కదా ? అప్పుడు ద్వైతమున్నది కదా ? 

ద; లేదయ్యా ! ఆ త్రాడు కూడా ఆత్మ యందు కల్పించ బడినదే. అనే విషయం తెలుస్తుందో ఆ క్షణంలోనే రజ్జు జ్ఞానంకూడా నశిస్తుంది. ఇక మిగిలేది ఆత్మ ఒక్కటే. అసలు త్రాదే లేకపోతే ఇంక పాము అనే భ్రాంతి ఎక్కడుంటుంది ? కాబట్టి దృశ్యము లేకపోతే మిగిలేది దృక్కే ఆ దృక్కు చిదాత్మకన్న వేరైనది కాదు. అందుకే ఇక్కడ ద్వైత ప్రసక్తి లేదు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 59 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻

✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj

CHAPTER 14

🌴 How the Universe is Mere Imagination; How to Gain that Strong Will which Can Create It; and the Highest Truth - 2 🌴

34-40. There could be nothing external to that ‘exterior’ except it be one’s own body. How can that be externalised from the ‘exterior’? For example, when you say ‘outside the hill’ the hill is withdrawn from the space beyond; it is not included in it. But the body is seen in space just as a pot is seen.

The body must therefore be external to the seer. What is visible lies within the range of illumination: if without, it cannot be seen. Therefore the illumined objects must be within the vision of the illuminant. The body, etc., are the illumined, because they are themselves objectified. The illumined and the illuminant cannot be identical. Again the illuminant cannot be objectified; for who is the seer apart from it? And how can the illumination by which he sees be apart from him? 

That the illuminant affords the light and serves as an object standing apart from the seer, is impossible to maintain. Therefore the illuminant cannot admit of any foreign admixture in it, and he is the illumination in perfection — only one, and the being of all. 

41. He extends as time and space; they are infinite and perfect, being involved as the illuminant, illumination and the illumined. 

42. As regards within or without, everything is included in illumination. How then can anything be ‘outer’, unless it is like a peak on a mountain? 

43. The whole universe is thus in the illumination which shines self-sufficient, by itself, everywhere, and at all times. 

44-45. Such illumination is Her Transcendental Majesty Tripura, the Supreme. She is called Brahma in the Vedas, Vishnu by the Vaisnavites, Siva by the Saivites, and Sakti by the Saktas. There is indeed nothing but She. 

46. She holds everything by Her prowess as a mirror does its images. She is the illuminant in relation to the illumined.

47-49. The object is sunk in illumination like the image of a city in a mirror. Just as the city is not apart from the mirror, so also the universe is not apart from consciousness.

Just as the image is part and parcel of the clear, smooth, compact and one mirror, so also the universe is part and parcel of the perfect, solid and unitary consciousness, namely the Self. 

50. The world cannot be demonstrably ascertained. Space is simply void, serving for the location of materials. 

51. The universe is, always and all-through, a phenomenon in the Self. The question then arises how consciousness, being void, is dense at the same time. 52. Just as a mirror, though, dense and impenetrable, contains the image, so also pure consciousness is dense and impenetrable and yet displays the universe by virtue of its self-sufficiency. 

53. Though consciousness is all-pervading, dense and single, it still holds the mobile and immobile creation within it, wonderful in its variety, with no immediate or ultimate cause for it. 

54-55. Just as the mirror remains unaffected by the passage of different images and yet continues to reflect as clearly as before, so also the one consciousness illumines the waking and dream states which can be verified by proper meditation. 

56. O King! Examine again your daydreams and mental imagery. Though they are perfect in detail, yet they are no less mental. 

57. Consciousness permeating them obviously remains unblemished before creation or after dissolution of the world; even during the existence of the world, it remains unaffected as the mirror by the images.

58. Though unperturbed, unblemished, thick, dense and single, the absolute consciousness being self-sufficient manifests within itself what looks ‘exterior’, just like a mirror reflecting space as external to itself. 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹