Posts

Showing posts from July, 2019

త్రిపురా రహస్యము - 1 / Tripura Rahasya - 1

Image
🌹 .  త్రిపురా రహస్యము - 1  / Tripura Rahasya - 1 🌹 🌻. స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻 ✍️.  క్రోవి పార్థసారథి 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 ప్రస్తావన 🌴 'నమస్మారం గురుదేవా!” రెండు గొంతులు ఒక్కసారిగా పలికేటప్పటికి ఉలిక్కిపడితలఎత్తి చూశాడు రత్నాకరుడు. ఎదురుగా వినమ్రులై, చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడి ఉన్నారు తన శిష్యులు కృష్ణశర్మ, నారాయణభట్టు. చాలా కాలానికి వచ్చిన శిష్యులను చూసి పరమానందభరితుడైనాడు రత్నాకరుడు. కుశలప్రశ్నల అనంతరము అడిగాడు ఏ పనిమీద వచ్చారు ?' అని. “గురువర్యా ! ఇప్పటిదాకా మీ వద్ద ఉపనిషత్తులు చెప్పుకున్నాం బ్రహ్మసూత్రాలుచెప్పుకున్నాం, శ్రీవిద్యలో అనేక గ్రంథాలను చెప్పుకున్నాం. ఇప్పుడు 'త్రిపురా రహస్య దీపిక' అనే జ్ఞానఖండాన్ని చెప్పుకుందామని వచ్చాం, కాబట్టి, కాదనక మమ్ములను కృతార్ధులను చెయ్యండి” అన్నారు శిష్యులు. ఆ మాటలకు, శిష్యుల యొక్క జ్ఞానజిజ్ఞాసకు ఆనందించినవాడై ఇవాల్టికి సెలవుతీసుకుని రేపు రండి అన్నాడు రత్నాకరుడు. అనుకున్న ప్రకారం మర్నాటి సాయం సమయానవచ్చిన శిష్యులు, గురువు గారికి సాష్టాంగ ప్రణామాలర్పించి, ఆయన అనుమతితోసుఖాసీనులైనారు. రత్నా...