శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 108 / Sri Gajanan Maharaj Life History - 108
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 108 / Sri Gajanan Maharaj Life History - 108 🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 20వ అధ్యాయము - 3 🌻 ఆ ముని ఈవిషయాలన్నీ గుర్తుచేయడం లక్ష్మణును కలవరపెట్టి ఈ మనిషి ఎవరా అని అతను ఆలోచనలో పడ్డాడు. లక్ష్మణ వినయంగా అతనికి వంగి నమస్కారం చేసాడు. అతను అకస్మాత్తుగా అదృశ్యం అయ్యారు. లక్ష్మణ ఇంటికి తిరిగివచ్చి తనయొక్క సాధారణ నడవడి ప్రారంభించి, ప్రతిసంవత్సరం పుణ్యతిధి జరపడం మొదలు పెట్టాడు. శ్రీ మహారాజు అవధూత జైరాంఖేడ్కరును మునివస్త్రాలలో రోహిత్ గ్రామందగ్గర కలిసారు. ప్రభుత్వ రెవిన్యు అధికారి అయిన మాధవ మార్తాండ జోషీ ఒకసారి కాలంబ కాసుర్ గ్రామ భూమి సర్వేకి వచ్చాడు. అతను శ్రీగజానన్ మహారాజు భక్తుడు అవడంవల్ల, ఆరోజు గురువారం అవడంవల్ల సాయంత్రం దర్శనంకోసం షేగాం వెళ్ళలని అతనికి అనిపించింది. అందువల్ల అతను తన గుమాస్తా కుతుబుద్దీన్ను షేగాం వెళ్ళేందుకు ఎడ్లబండి తయారు చెయ్యమని చెప్పాడు. కుతుబుద్దీన్ వినయంగా, వాతావరణం మబ్బుగా ఉందనీ, మాన్ నది మట్టినీళ్ళతో పొంగుతోందని అన్నాడు. అతని అభ్యర్ధన విస్మరించి, జోషీ బండిలోకి ఎక్కి కుతుబుద్దీన్ ను షేగ...