శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 67 / Sri Gajanan Maharaj Life History - 67
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 67 / Sri Gajanan Maharaj Life History - 67 🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 13వ అధ్యాయము - 4 🌻 వాళ్ళు చేతులు కట్టుకుని, మీజబ్బు శ్రీమహారాజు దయవల్ల నయమయింది, కాబట్టి మాతో ఇంటికి వెళ్ళడానికి ఆయన నుండి అనుమతి అర్ధించమని అన్నారు. దయచేసి నన్ను ప్రార్ధించకండి. నేను ఎంతమాత్రం ఇక మీకు చెందినవాడినికాను. శ్రీమహారాజు నన్ను చెంపమీద కొట్టి, నేను వేసుకున్న కాషాయ వస్త్రాలను కించపరచ కూడదని నన్ను స్పృహలోకి తెచ్చారు. నాకళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి, అందుచే నేను ఈసంసారిక జీవనంనుండి దూరంగా ఉండదలచాను. సంతోషభారతి నీవు వినయంగాఉంటూ తల్లి సేవ చెయ్యి. ఇకమీరు ఇంటికి వెళితేమంచిది. తల్లి సేవ చేయడానికి పుండలీకుని నడవడి అనుసరించు. అదినీకు వాసుదేవుని ఆశీర్వాదాలు తెస్తుంది. నేను తిరిగి సావదాద్ వస్తే ఆవ్యాధి తిరిగి నన్ను పట్టుకుంటుంది. కావున నన్ను బలవంతం పెట్టకండి. ఇంతవరకు నేను మీకు సంబంధితుడను, ఇకనుండి నేను భగవంతునికి అర్పించుకుంటున్నాను. ఈవిధమయిన నా ఆలోచన సరళిలో మార్పు శ్రీమహారాజు దయవల్ల వచ్చింది. దయచేసి నన్ను ఇంకఏమాత్రం మోహించకండి అని గ...